ద్వితియోపదేశకాండము 25:3

నలువది దెబ్బలు కొట్టింపవచ్చును అంతకు మించకూడదు. వీటి కంటే విస్తారమైన దెబ్బలు కొట్టించినయెడల నీ సహోద రుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో.

సందర్భంతో చదవండి · ద్వితియోపదేశకాండము 25

1మనుష్యులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చు నప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతి మంతుడనియు దోషిని దోషియనియు తీర్పు తీర్చవలెను.

2ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడినయెడల న్యాయాధి పతి వాని పండుకొనబెట్టి వాని నేరముకొలది దెబ్బలు లెక్కపెట్టి తనయెదుట వాని కొట్టింపవలెను.

3నలువది దెబ్బలు కొట్టింపవచ్చును అంతకు మించకూడదు. వీటి కంటే విస్తారమైన దెబ్బలు కొట్టించినయెడల నీ సహోద రుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో.

4నూర్చెడియెద్దు మూతికి చిక్కము వేయకూడదు.

5సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానములేక చనిపోయినయెడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లిచేసికొనకూడదు; ఆమె పెని మిటి సహోదరుడు ఆమెయొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసికొని తన సహోదరునికి మారుగా ఆమెయెడల భర్త ధర్మము జరపవలెను.

ద్వితియోపదేశకాండము 25 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी