1 సమూయేలు 16:11

నీ కుమారులందరు ఇక్కడనున్నారా అని యెష్షయిని అడుగగా అతడుఇంకను కడసారివాడున్నాడు. అయితే వాడు గొఱ్ఱలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలునీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చువరకు మనము కూర్చుందమని యెష్షయితో చెప్పగా

సందర్భంతో చదవండి · 1 సమూయేలు 16

9అప్పుడు యెష్షయి షమ్మాను పిలువగా అతడుయెహోవా ఇతనిని కోరుకొనలేదనెను.

10యెష్షయి తన యేడుగురు కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలుయెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి

11నీ కుమారులందరు ఇక్కడనున్నారా అని యెష్షయిని అడుగగా అతడుఇంకను కడసారివాడున్నాడు. అయితే వాడు గొఱ్ఱలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలునీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చువరకు మనము కూర్చుందమని యెష్షయితో చెప్పగా

12అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొనివచ్చెను. అతడు ఎఱ్ఱనివాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైనవాడునై యుండెను. అతడు రాగానేనేను కోరుకొన్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవియ్యగా

13సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల యెదుట వానికి అభిషేకము చేసెను. నాటనుండి యెహోవా ఆత్మ దావీదుమీదికి బలముగా వచ్చెను. తరువాత సమూ యేలు లేచి రామాకు వెళ్లిపోయెను.

1 సమూయేలు 16 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी