రాజైన దర్యావేషు ఏలుబడి యందు ఆరవ సంవత్సరము అదారు నెల మూడవనాటికి మందిరము సమాప్తి చేయ బడెను.
13అప్పుడు నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బోజ్నయియును వారి పక్షమున నున్నవారును రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞచొప్పున వేగముగా పని జరిపించిరి.
14యూదుల పెద్దలు కట్టించుచు, ప్రవక్తయైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జెకర్యాయు హెచ్చ రించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞ ననుసరించి వారు కట్టించుచు, కోరెషు దర్యావేషు అర్తహషస్త అను పారసీక దేశపురాజుల ఆజ్ఞచొప్పున ఆ పని సమాప్తి చేసిరి.
15రాజైన దర్యావేషు ఏలుబడి యందు ఆరవ సంవత్సరము అదారు నెల మూడవనాటికి మందిరము సమాప్తి చేయ బడెను.
16అప్పుడు ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును చెరలోనుండి విడుదలనొందిన తక్కినవారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి.
17దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు నూరు ఎడ్లను రెండు వందల పొట్టేళ్లను నాలుగువందల గొఱ్ఱపిల్లలను ఇశ్రా యేలీయులకందరికిని పాపపరిహారార్థ బలిగా ఇశ్రాయేలీ యుల గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు మేక పోతులను అర్పించిరి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి