యెహోషువ 8:5

​నేనును నాతోకూడనున్న జనులందరును పట్టణమునకు సమీపించె దము, వారు మునుపటివలె మమ్మును ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారియెదుట నిలువక పారిపోదుము.

సందర్భంతో చదవండి · యెహోషువ 8

3యెహోషువయు యోధు లందరును హాయిమీదికి పోవలెననియుండగా, యెహో షువ పరాక్రమముగల ముప్పదివేల శూరులను ఏర్పరచి రాత్రివేళ వారిని పంపి

4వారి కాజ్ఞాపించినదేమనగా ఈ పట్టణమునకు పడమటివైపున మీరు దాని పట్టుకొన చూచుచు పొంచియుండవలెను పట్టణమునకు బహుదూర మునకు వెళ్లక మీరందరు సిద్ధపడియుండుడి.

5​నేనును నాతోకూడనున్న జనులందరును పట్టణమునకు సమీపించె దము, వారు మునుపటివలె మమ్మును ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారియెదుట నిలువక పారిపోదుము.

6మునుపటివలె వీరు మనయెదుట నిలువలేక పారిపోదురని వారనుకొని, మేము పట్టణమునొద్దనుండి వారిని తొలగి రాజేయువరకు వారు మా వెంబడిని బయలు దేరి వచ్చెదరు; మేము వారియెదుట నిలువక పారిపోయి నప్పుడు మీరు పొంచియుండుట మాని

7లేచి పట్టణమును పట్టుకొనుడి; మీ దేవుడైన యెహోవా మీ చేతికి దాని నప్పగించును.

యెహోషువ 8 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी