చుట్టు మధ్యగోడల నిడివి ఇరువది యైదు మూరలు,వెడల్పు అయిదు మూరలు.
28అతడు దక్షిణమార్గమున లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకొనిపోయి దక్షిణపు గుమ్మమును కొలిచెను; దాని కొలత అదే.
29మరియు దాని కావలిగదులును స్తంభ ములును మధ్య గోడలును పైచెప్పిన కొలతకు సరిపడెను; దానికిని దాని చుట్టు ఉన్న మధ్యగోడలకును కిటికీలుండెను, దాని నిడివి ఏబది మూరలు దాని వెడల్పు ఇరు వదియైదు మూరలు
30చుట్టు మధ్యగోడల నిడివి ఇరువది యైదు మూరలు,వెడల్పు అయిదు మూరలు.
31దాని మధ్య గోడలు బయటి ఆవరణముతట్టు చూచుచుండెను; దాని స్తంభములమీద ఖర్జూరపుచెట్లను పోలిన అలంకారముం డెను; ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను.
32తూర్పుతట్టు లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకొనిపోయి దాని గుమ్మమును ఆయన కొలువగా పైచెప్పిన కొలత తేలెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి