2 సమూయేలు 4:9

​దావీదు బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులైన రేకాబుతోను బయనాతోను ఇట్లనెను

సందర్భంతో చదవండి · 2 సమూయేలు 4

7వారతని పొడిచి చంపి అతని తలను ఛేదించి దానిని తీసికొని రాత్రి అంతయు మైదాన ములో బడి ప్రయాణమైపోయి హెబ్రోనులోనున్న దావీదునొద్దకు ఇష్బోషెతు తలను తీసికొనివచ్చిచిత్త గించుము;

8​నీ ప్రాణము తీయచూచిన సౌలుకుమారుడైన ఇష్బోషెతు తలను మేము తెచ్చియున్నాము; ఈ దినమున యెహోవా మా యేలినవాడవును రాజవునగు నీ పక్షమున సౌలుకును అతని సంతతికిని ప్రతికారము చేసి యున్నాడని చెప్పగా

9​దావీదు బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులైన రేకాబుతోను బయనాతోను ఇట్లనెను

10​మంచి వర్తమానము తెచ్చితినని తలంచియొకడు వచ్చి సౌలు చచ్చెనని నాకు తెలియజెప్పగా

11​వాడు తెచ్చిన వర్తమానమునకు బహుమానముగా సిక్లగులో నేను వానిని పట్టుకొని చంపించితిని. కావున దుర్మార్గులైన మీరు ఇష్బోషెతు ఇంటిలో చొరబడి, అతని మంచము మీదనే నిర్దోషియగువానిని చంపినప్పుడు మీచేత అతని ప్రాణదోషము విచారింపక పోవుదునా? లోకములో ఉండకుండ నేను మిమ్మును తీసివేయక మానుదునా?

2 సమూయేలు 4 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी