అంతట మేము ఓడ ఎక్కితివిు, వారు తమ తమ యిండ్లకు తిరిగి వెళ్లిరి.
4మేమక్కడ నున్న శిష్యులను కనుగొని యేడుదినములక్కడ ఉంటిమి. వారునీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మద్వారా పౌలుతో చెప్పిరి.
5ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమై పోవుచుండగా, భార్యలతోను పిల్లలతోను వారందరు మమ్మును పట్టణము వెలుపలి వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్రతీరమున మోకాళ్లూని ప్రార్థనచేసి యొకరియొద్ద ఒకరము సెలవు పుచ్చుకొంటిమి.
6అంతట మేము ఓడ ఎక్కితివిు, వారు తమ తమ యిండ్లకు తిరిగి వెళ్లిరి.
7మేము తూరునుండి చేసిన ప్రయాణము ముగించి, తొలెమాయికి వచ్చి, సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినముంటిమి.
8మరునాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చి, యేడుగురిలో నొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతనియొద్ద ఉంటిమి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి