యెహేజ్కేలు 22:7

నీలో తలిదండ్రులు అవమానమొందుదురు, నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యము నొందుదురు, నీలో తండ్రిలేని వారును విధవరాండ్రును హింసింపబడుదురు,

సందర్భంతో చదవండి · యెహేజ్కేలు 22

5​సమీపస్థులేమి దూరస్థులేమి అంద రును అపకీర్తి పొందినదానవనియు అల్లరితో నిండినదాన వనియు నిన్ను అపహసింతురు.

6​నీలోని ఇశ్రాయేలీయుల ప్రధానులందరును తమ శక్తికొలది నరహత్యచేయుదురు,

7నీలో తలిదండ్రులు అవమానమొందుదురు, నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యము నొందుదురు, నీలో తండ్రిలేని వారును విధవరాండ్రును హింసింపబడుదురు,

8నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు, నా విశ్రాంతిదినములను నీవు అపవిత్రపరచుచున్నావు.

9కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపుర మున్నారు, పర్వతములమీద భోజనము చేయువారు నీ మధ్య నివసించుచున్నారు, నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి.

యెహేజ్కేలు 22 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी