దానియేలు 10:5

నేను కన్నులెత్తిచూడగా, నారబట్టలు ధరించుకొన్న యొకడు కనబడెను, అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొనియుండెను.

సందర్భంతో చదవండి · దానియేలు 10

3మూడు వారములు గడచువరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని; మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములను చేసికొనలేదు.

4మొదటి నెల యిరువది నాలుగవతేది నేను హిద్దెకెలను గొప్ప నది తీరమున ఉంటిని.

5నేను కన్నులెత్తిచూడగా, నారబట్టలు ధరించుకొన్న యొకడు కనబడెను, అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొనియుండెను.

6అతని శరీరము రక్తవర్ణపు రాతివంటిది, అతని ముఖము మెరుపువలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములును పాదములును తళతళలాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వనివలె ఉండెను

7దానియేలను నాకు ఈ దర్శ నము కలుగగా నాతోకూడనున్న మనుష్యులు దాని చూడలేదు గాని మిగుల భయాక్రాంతులై దాగుకొన వలెనని పారిపోయిరి.

దానియేలు 10 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी