స్రావముగలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము.
7స్రావముగల వాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయం కాలమువరకు అపవిత్రుడై యుండును.
8స్రావముగల వాడు పవిత్రునిమీద ఉమి్మవేసినయెడల వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.
9స్రావముగలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము.
10వాని క్రిందనుండిన యే వస్తువునైనను ముట్టు ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును. వాటిని మోయువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును.
11స్రావముగలవాడు నీళ్లతో చేతులు కడుగుకొనకయే ఎవని ముట్టునోవాడు తన బట్టలు ఉదుకుకొని స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి