2 సమూయేలు 7:8

కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఈలాగు చెప్పుముసైన్యముల కధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చునదేమనగాగొఱ్ఱల కాపులోనున్న నిన్ను గొఱ్ఱలదొడ్డిలోనుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనులమీద అధిపతిగా నియమించి తిని.

సందర్భంతో చదవండి · 2 సమూయేలు 7

6ఐగుప్తులోనుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాటనుండి నేటివరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించితిని.

7ఇశ్రాయేలీయులతోకూడ నేను సంచరించిన కాల మంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్రములలో ఎవరితోనైనను దేవ దారుమయమైన మందిరమొకటి మీరు నాకు కట్టింపక పోతిరే అని నేనెన్నడైనను అనియుంటినా?

8కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఈలాగు చెప్పుముసైన్యముల కధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చునదేమనగాగొఱ్ఱల కాపులోనున్న నిన్ను గొఱ్ఱలదొడ్డిలోనుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనులమీద అధిపతిగా నియమించి తిని.

9నీవు పోవు చోట్లనెల్లను నీకు తోడుగానుండి నీ శత్రువులనందరిని నీ యెదుట నిలువకుండ నిర్మూలముచేసి, లోకము లోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి యున్నాను.

10మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండ తమ స్వస్థలమందు నివసించునట్లు దానియందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలీయులను నా జనులమీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచు వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టకయుండునట్లుగా చేసి

2 సమూయేలు 7 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी