యెహేజ్కేలు 29:3

ఐగుప్తు రాజైన ఫరో, నైలునదిలో పండుకొనియున్న పెద్దమొసలీ, నేను నీకు విరోధిని; నైలునది నాది, నేనే దాని కలుగ జేసితిని అని నీవు చెప్పుకొనుచున్నావే;

సందర్భంతో చదవండి · యెహేజ్కేలు 29

1పదియవ సంవత్సరము పదియవ నెల పండ్రెండవ... దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2నరపుత్రుడా, నీ ముఖమును ఐగుప్తురాజైన ఫరోవైపు త్రిప్పుకొని అతనిగూర్చియు ఐగుప్తు దేశ మంతటినిగూర్చియు ఈ సమాచారమెత్తి ప్రవచింపుముప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా

3ఐగుప్తు రాజైన ఫరో, నైలునదిలో పండుకొనియున్న పెద్దమొసలీ, నేను నీకు విరోధిని; నైలునది నాది, నేనే దాని కలుగ జేసితిని అని నీవు చెప్పుకొనుచున్నావే;

4​నేను నీ దవుడ లకు గాలములు తగిలించి, నీ నదులలోనున్న చేపలను నీ పొలుసులకు అంటజేసి, నైలులోనుండి నిన్నును నీ పొలుసు లకు అంటిన నైలు చేపలన్నిటిని బయటికి లాగెదను.

5​నిన్నును నైలునది చేపలన్నిటిని అరణ్యములో పారబోసె దను, ఎత్తు వాడును కూర్చువాడును లేక నీవు తెరపనేల మీద పడుదువు, అడవిమృగములకును ఆకాశపక్షులకును ఆహారముగా నిచ్చెదను.

యెహేజ్కేలు 29 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी