గదులమధ్య మందరిముచుట్టు నలుదిశల ఇరువది మూరల వెడల్పున చోటు విడువబడి యుండెను
8మరియు నేను చూడగా మంది రము చుట్టునున్న నేలకట్టు ఎత్తుగా కనబడెను, ఏల యనగా ఆ మేడగదులకు ఆరు పెద్దమూరలుగల పునాది యుండెను.
9మేడగదులకు బయటనున్న గోడ అయిదు మూరల వెడల్పు; మరియు మందిరపు మేడగదుల ప్రక్కల నున్న స్థలము ఖాలీగా విడువబడి యుండెను
10గదులమధ్య మందరిముచుట్టు నలుదిశల ఇరువది మూరల వెడల్పున చోటు విడువబడి యుండెను
11మేడగదుల వాకిండ్లు ఖాలీగానున్న స్థలముతట్టు ఉండెను; ఒక వాకిలి ఉత్తరపు తట్టునను ఇంకొక వాకిలి దక్షిణపుతట్టునను ఉండెను. ఖాలీగా నున్న స్థలముచుట్టు అయిదు మూరల వెడల్పుం డెను.
12ప్రత్యేకింపబడిన చోటుకెదురుగానున్న కట్ట డము పడమటితట్టు డెబ్బది మూరల వెడల్పు, దాని గోడ అయిదు మూరల వెడల్పు; గోడ నిడివి తొంబది మూరలు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి