యెహేజ్కేలు 11:14

అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

సందర్భంతో చదవండి · యెహేజ్కేలు 11

12అప్పుడు మీ చుట్టు నున్న అన్యజనుల విధుల నాచరించుటకై మీరు ఎవని కట్టడల ననుసరింపక మానితిరో యెవని విధులను ఆచ రింపకపోతిరో, ఆ యెహోవానగు నేనే ఆయననని మీరు తెలిసికొందురు.

13నేను ఆ ప్రకారము ప్రవచింపు చుండగా బెనాయా కుమారుడైన పెలట్యా చచ్చెను గనుక నేను సాష్టాంగపడి యెలుగెతి ్తఅయ్యో, ప్రభువా, యెహోవా, ఇశ్రాయేలీయుల శేషమును నీవు నిర్మూలము చేయుదువా? అని మొఱ్ఱపెట్టితిని.

14అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

15నరపుత్రుడా, యెరూషలేము పట్టణపువారుఈ దేశము మాకు స్వాస్థ్యముగా ఇయ్య బడెను, మీరు యెహోవాకు దూరస్థులుగా నుండుడి, అని యెవరితో చెప్పుచున్నారో వారందరు ఇశ్రాయేలీయులై నీకు సాక్షాద్బంధువులును నీచేత బంధుత్వధర్మము నొందవలసినవారునై యున్నారు.

16కాబట్టి వారికి ఈ మాట ప్రకటింపుముప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా దూరముననున్న అన్యజనులలోనికి నేను వారిని తోలివేసినను, ఆ యా దేశములలో వారిని చెదరగొట్టి నను, వారు వెళ్ళిన ఆ యా దేశములలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధాలయముగా ఉందును.

యెహేజ్కేలు 11 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी