హెబ్రీయులకు 10:9

ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు. ఇవన్నియు ధర్మశాస్త్రముచొప్పున అర్పింప బడుచున్నవి. ఆ రెండవదానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు.

సందర్భంతో చదవండి · హెబ్రీయులకు 10

7అప్పుడు నేనుగ్రంథపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని.

8బలులు అర్పణలు పూర్ణహోమములు పాపపరి హారార్థబలులును నీవు కోరలేదనియు, అవి నీకిష్ఠమైనవి కావనియు పైని చెప్పిన తరువాత

9ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు. ఇవన్నియు ధర్మశాస్త్రముచొప్పున అర్పింప బడుచున్నవి. ఆ రెండవదానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు.

10యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము.

11మరియు ప్రతి యాజకుడు దినదినము సేవచేయుచు, పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పిం చుచు ఉండును.

హెబ్రీయులకు 10 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी