1 సమూయేలు 17:53

అప్పుడు ఇశ్రా యేలీయులు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకొనిరి.

సందర్భంతో చదవండి · 1 సమూయేలు 17

51వాడు బోర్లపడగా దావీదు పరుగెత్తిపోయి ఫిలిష్తీయునిమీద నిలుచుండి వాని కత్తి వర దూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారి పోయిరి.

52అప్పుడు ఇశ్రాయేలువారును యూదావారును లేచిజయము జయమని అరచుచు లోయవరకును షరా యిము ఎక్రోనువరకును ఫిలిష్తీయులను తరుమగా ఫిలిష్తీ యులు హతులై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణములవరకు కూలిరి.

53అప్పుడు ఇశ్రా యేలీయులు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకొనిరి.

54అయితే దావీదు ఆ ఫిలిష్తీ యుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసికొని యెరూషలేమునకు వచ్చెను.

55సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతియైన అబ్నేరును పిలిచి అబ్నేరూ, ఈ ¸°వనుడు ఎవని కుమారుడని అడుగగా అబ్నేరురాజా, నీ ప్రాణముతోడు నాకు తెలియదనెను.

1 సమూయేలు 17 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी