యెహేజ్కేలు 16:49

నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా, దానికిని దాని కుమార్తెల కును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు ననునదియే; అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను.

సందర్భంతో చదవండి · యెహేజ్కేలు 16

47అయితే వారి ప్రవర్తన ననుసరించుటయు, వారు చేయు హేయక్రియలు చేయుటయు స్వల్పకార్యమని యెంచి, వారి నడతలను మించునట్లుగా నీవు చెడుమార్గములయందు ప్రవర్తించితివి.

48నీవును నీ కుమార్తెలును చేసినట్లు నీ చెల్లె లైన సొదొమయైనను దాని కుమార్తెలైనను చేసినవారు కారని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

49నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా, దానికిని దాని కుమార్తెల కును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు ననునదియే; అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను.

50వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దాని చూచి వారిని వెళ్లగొట్టితిని.

51షోమ్రోను సహా నీ పాపములలో సగమైన చేయలేదు, అది చేసినవాటి కంటె నీవు అత్యధి కముగా హేయక్రియలు చేసితివి; నీవు ఇన్ని హేయ క్రియలు చేసి నీ సహోదరిని నిర్దోషురాలినిగా కనుపర చితివి.

యెహేజ్కేలు 16 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी