లూకా 10:23

అప్పుడాయన తన శిష్యులవైపు తిరిగి-మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి;

సందర్భంతో చదవండి · లూకా 10

21ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి-తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలు పరచినావని నిన్ను స్తుతించు చున్నాను; అవును తండ్రీ, ఆలాగు నీ దృష్టికి అనుకూల మాయెను.

22సమస్తమును నా తండ్రిచేత నాకు అప్పగింప బడియున్నది; కుమారుడెవడో, తండ్రి తప్ప మరెవడును ఎరుగడు; తండ్రి ఎవడో, కుమారుడును కుమారుడెవనికి ఆయనను బయలు పరచనుద్దేశించునో వాడును తప్ప, మరెవడును ఎరుగడని చెప్పెను.

23అప్పుడాయన తన శిష్యులవైపు తిరిగి-మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి;

24అనేకమంది ప్రవక్తలును రాజు లును, మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని యేకాంతమందు వారితో అనెను.

25ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగెను.

లూకా 10 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी