బబులోనుదేశములో నివాసివగు సీయోనూ, అచ్చటనుండి తప్పించుకొని పొమ్ము; ఇదే యెహోవా వాక్కు.
5నేను దానిచుట్టు అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణ ముగా ఉందును; ఇదే యెహోవా వాక్కు.
6ఉత్తర దేశములో ఉన్నవారలారా, తప్పించుకొని రండి; ఆకా శపు నాలుగు వాయువులంత విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసియున్నాను; ఇదే యెహోవా వాక్కు.
7బబులోనుదేశములో నివాసివగు సీయోనూ, అచ్చటనుండి తప్పించుకొని పొమ్ము; ఇదే యెహోవా వాక్కు.
8సైన్య ములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగామిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని యెంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి, మిమ్మును దోచు కొనిన అన్యజనులయొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు.
9నేను నా చేతిని వారిమీద ఆడించగా వారు తమ దాసు లకు దోపుడు సొమ్మగుదురు; అప్పుడు సైన్యములకు అధిపతి యగు యెహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలిసి కొందురు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి