యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి.
2సత్యము నాచరించు నీతిగల జనము ప్రవేశించునట్లు ద్వారములను తీయుడి.
3ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు.
4యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి.
5ఆయన ఉన్నతస్థల నివాసులను ఎత్తయిన దుర్గమును దిగగొట్టువాడు ఆయన వాని పడగొట్టెను నేలకు దాని పడగొట్టెను ఆయన ధూళిలో దాని కలిపి యున్నాడు
6కాళ్లు, బీదలకాళ్లు, దీనులకాళ్లు, దాని త్రొక్కు చున్నవి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి