యెహేజ్కేలు 16:35

కాబట్టి వేశ్యా, యెహోవా మాట ఆలకింపుము

సందర్భంతో చదవండి · యెహేజ్కేలు 16

33నీ విటకాండ్రు నలుదిక్కులనుండి వచ్చి నీతో వ్యభిచరించునట్లు వారికందరికి నీవే సొమి్మచ్చుచు వచ్చి తివి, బహుమానముల నిచ్చుచు వచ్చితివి.

34నీ జారత్వ మునకును ఇతర స్త్రీల జారత్వమునకును భేదమేమనగా వ్యభిచరించుటకు ఎవడైనను నీ వెంట తిరుగుటయు లేదు, నీకు పడుపుసొమి్మచ్చుటయు లేదు, నీవే యెదురు జీత మిచ్చితివి, ఇదే నీకును వారికిని కలిగిన భేదము; ఇదే యెహోవా వాక్కు.

35కాబట్టి వేశ్యా, యెహోవా మాట ఆలకింపుము

36ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగానీ విట కాండ్రతో నీవు నీ సొమ్ము వ్యయపరచి నీవు వ్యభిచారము చేసి నీ మానము నీవు కనుపరచుకొనిన దానిని బట్టియు, నీ విటకాండ్రనుబట్టియు, హేయ విగ్రహములను బట్టియు, నీవు వాటికప్పగించిన నీ బిడ్డల రక్తమునుబట్టియు,

37​నీవు సంభోగించిన నీ విట కాండ్రనందరిని నీకిష్టులైన వారినందరిని నీవు ద్వేషించు వారినందరిని నేను పోగుచేయుచున్నాను; వారిని నీ చుట్టు పోగుచేసి సమకూర్చి వారికి నీ మానము కనబడునట్లు నేను దాని బయలుపరచెదను.

యెహేజ్కేలు 16 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी