ఉత్తర దిక్కున సెదాదునకు పోవు మార్గమున మహా సముద్రము మొదలుకొని హెత్లోనువరకు దేశమునకు సరిహద్దు.
13ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా సరి హద్దులనుబట్టి ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల ప్రకారము మీరు స్వాస్థ్యముగా పంచుకొనవలసిన భూమి యిది; యోసేపు సంతతికి రెండు భాగములియ్యవలెను.
14నేను ప్రమాణముచేసి మీ పితరులకు ఈ దేశము ఇచ్చి తిని గనుక ఏమియు భేదములేకుండ మీలో ప్రతివాడును దానిలో స్వాస్థ్యమునొందును; ఈలాగున అది మీకు స్వాస్థ్యమగును.
15ఉత్తర దిక్కున సెదాదునకు పోవు మార్గమున మహా సముద్రము మొదలుకొని హెత్లోనువరకు దేశమునకు సరిహద్దు.
16అది హమాతునకును బేరోతా యునకును దమస్కు సరిహద్దునకును హమాతు సరిహద్దు నకును మధ్యనున్న సిబ్రయీమునకును హవ్రాను సరిహద్దును ఆనుకొను మధ్యస్థలమైన హాజేరునకును వ్యాపిం చును.
17పడమటి సరిహద్దు హసరేనాను అను దమస్కు సరిహద్దు పట్టణము, ఉత్తరపు సరిహద్దు హమాతు; ఇది మీకు ఉత్తరపు సరిహద్దు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి