ఎస్తేరు 6:3

రాజు ఆ సంగతి వినిఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి యేదై నను ఘనత యేదైనను చేయబడెనా అని యడుగగా రాజు సేవకులు అతనికేమియు చేయబడలేదని ప్రత్యుత్తర మిచ్చిరి.

సందర్భంతో చదవండి · ఎస్తేరు 6

1ఆ రాత్రి నిద్రపట్టక పోయినందున రాజ్యపు సమా చార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను.

2ద్వారపాలకులైన బిగ్తాను తెరెషు అను రాజుయొక్క యిద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడి యుండెను.

3రాజు ఆ సంగతి వినిఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి యేదై నను ఘనత యేదైనను చేయబడెనా అని యడుగగా రాజు సేవకులు అతనికేమియు చేయబడలేదని ప్రత్యుత్తర మిచ్చిరి.

4అప్పుడుఆవరణములో ఎవరో యున్నారని రాజు చెప్పెను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్యమీద మొర్దెకైని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగరుయొక్క ఆవరణము లోనికి వచ్చియుండెను.

5రాజ సేవకులుఏలినవాడా చిత్త గించుము, హామాను ఆవరణములో నిలువబడియున్నాడని రాజుతో చెప్పగా రాజు అతని రానియ్యుడని సెలవిచ్చి నందున హామాను లోపలికి వచ్చెను.

ఎస్తేరు 6 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी