వారు మితి లేకుండ తిరుగు బాటుచేసిరి గనుక నేను వారినందరిని శిక్షింతును.
1యాజకులారా, నామాట ఆలకించుడి; ఇశ్రాయేలు వారలారా, చెవిని బెట్టి ఆలోచించుడి; రాజసంతతివార లారా, చెవియొగ్గి ఆలకించుడి, మీరు మిస్పామీద ఉరి గాను తాబోరుమీద వలగాను ఉన్నారు గనుక మిమ్మును బట్టి ఈ తీర్పు జరుగును.
2వారు మితి లేకుండ తిరుగు బాటుచేసిరి గనుక నేను వారినందరిని శిక్షింతును.
3ఎఫ్రాయిమును నేనెరుగుదును; ఇశ్రాయేలువారు నాకు మరుగైనవారు కారు. ఎఫ్రాయిమూ, నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు; ఇశ్రాయేలువారు అపవిత్రులైరి.
4తమ క్రియలచేత అభ్యంతరపరచబడినవారై వారు తమ దేవునియొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలో వ్యభిచార మనస్సుండుటవలన వారు యెహోవాను ఎరుగక యుందురు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి