1 దినవృత్తాంతములు 7:3

ఉజ్జీ కుమారులలో ఒకడు ఇజ్రహయా. ఇజ్రహయా కుమారులు మిఖాయేలు ఓబద్యా యోవేలు ఇష్షీయా; వీరు అయిదుగురు పెద్దలై యుండిరి.

సందర్భంతో చదవండి · 1 దినవృత్తాంతములు 7

1ఇశ్శాఖారు కుమారులు నలుగురు. వారు తోలా పువ్వా యాషూబు షిమ్రోను అనువారు

2తోలా కుమారులు ఉజ్జీ రెఫాయా యెరీయేలు యహ్మయి యిబ్శాము షెమూయేలు; తోలాకు పుట్టిన వీరు తమ పితరుల యిండ్లకు పెద్దలు; వీరు తమ తరములలో పరాక్రమ శాలులై యుండిరి; దావీదు దినములలో వీరి సంఖ్యయిరువది రెండువేల ఆరువందలు.

3ఉజ్జీ కుమారులలో ఒకడు ఇజ్రహయా. ఇజ్రహయా కుమారులు మిఖాయేలు ఓబద్యా యోవేలు ఇష్షీయా; వీరు అయిదుగురు పెద్దలై యుండిరి.

4వారికి బహుమంది భార్యలును పిల్లలును కలిగి యుండుటచేత వారి పితరుల యిండ్ల లెక్కను వారి వంశములలో సేనకు చేరినవారు ముప్పది ఆరువేలమంది యుండిరి.

5మరియు ఇశ్శాఖారు వంశములన్నిటిలో వారి సహోదరులైన పరాక్రమశాలులందరు తమ వంశావళుల చొప్పున ఎనుబది యేడువేలమంది యుండిరి.

1 దినవృత్తాంతములు 7 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी