నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలుగలేదు గనుక ఎలియాజరు ఈతా మారును తమ తండ్రి యైన అహరోను ఎదుట యాజక సేవచేసిరి.
2అహరోను కుమారుల పేరులు ఏవనగా, తొలుతపుట్టిన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు అనునవే.
3ఇవి అభిషేకమునొంది యాజకులైన అహరోను కుమారుల పేరులు; వారు యాజకులగునట్లు అతడు వారిని ప్రతిష్ఠిం చెను.
4నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలుగలేదు గనుక ఎలియాజరు ఈతా మారును తమ తండ్రి యైన అహరోను ఎదుట యాజక సేవచేసిరి.
5మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను నీవు లేవి గోత్రికులను తీసికొనివచ్చి
6వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువబెట్టుము.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి