2 రాజులు 9:11

​యెహూ బయలుదేరి తన యజమానుని సేవకులయొద్దకు రాగా ఒకడుఏమి సంభ వించినది? ఆ వెఱ్ఱివాడు నీయొద్దకు వచ్చిన హేతువేమని అతని నడుగగా, అతడువానిని వాని మాటలు మీరెరిగెయున్నారని చెప్పెను.

సందర్భంతో చదవండి · 2 రాజులు 9

9​నెబాతు కుమారు డైన యరొబాము కుటుంబికులను అహీయా కుమారుడైన బయెషా కుటుంబికులను నేను అప్పగించినట్లు అహాబు కుటుంబికులను నేను అప్పగించుదును.

10​​యెజెబెలు పాతి పెట్టబడక యెజ్రెయేలు భూభాగమందు కుక్కలచేత తినివేయబడును. ఆ ¸°వనుడు ఈ మాటలు చెప్పి తలుపుతీసి పారిపోయెను.

11​యెహూ బయలుదేరి తన యజమానుని సేవకులయొద్దకు రాగా ఒకడుఏమి సంభ వించినది? ఆ వెఱ్ఱివాడు నీయొద్దకు వచ్చిన హేతువేమని అతని నడుగగా, అతడువానిని వాని మాటలు మీరెరిగెయున్నారని చెప్పెను.

12​​కాబట్టి వారు అదంతయు వట్టిది; జరిగినదానిని మాకు తెలియజెప్పుమనగా అతడిట్లనెనునేను నిన్ను ఇశ్రాయేలుమీద పట్టాభిషిక్తునిగా చేయు చున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పెను.

13అంతట వారు అతివేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్లమీద అతని క్రింద పరచి బాకా ఊదించియెహూ రాజైయున్నాడని చాటించిరి.

2 రాజులు 9 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी