2 సమూయేలు 19:9

అంతట ఇశ్రాయేలువారి గోత్రములకు చేరికైన జనులందరు ఇట్లనుకొనిరిమన శత్రువుల చేతిలోనుండియు, ఫిలిష్తీయుల చేతిలోనుండియు మనలను విడిపించిన రాజు అబ్షాలోమునకు భయపడి దేశములోనుండి పారిపోయెను.

సందర్భంతో చదవండి · 2 సమూయేలు 19

7నీవు బయటికి రాకయుండిన యెడల ఈ రాత్రి యొకడును నీయొద్ద నిలువడని యెహోవా నామమునుబట్టి ప్రమాణము చేసి చెప్పుచున్నాను; నీ బాల్యమునుండి నేటివరకు నీకు ప్రాప్తించిన అపాయము లన్నిటికంటె అది నీకు కష్టతరముగా ఉండునని రాజుతో మనవిచేయగా రాజు లేచి వచ్చి గుమ్మములో కూర్చుం డెను.

8రాజు గుమ్మములో కూర్చున్నాడను మాట జనులందరు విని రాజును దర్శింప వచ్చిరిగాని ఇశ్రాయేలువారు తమ తమ యిండ్లకు పారిపోయిరి.

9అంతట ఇశ్రాయేలువారి గోత్రములకు చేరికైన జనులందరు ఇట్లనుకొనిరిమన శత్రువుల చేతిలోనుండియు, ఫిలిష్తీయుల చేతిలోనుండియు మనలను విడిపించిన రాజు అబ్షాలోమునకు భయపడి దేశములోనుండి పారిపోయెను.

10మనమీద మనము రాజుగా పట్టాభిషేకము చేసిన అబ్షాలోము యుద్దమందు మరణమాయెను. కాబట్టి మనము రాజును మరల తోడుకొని వచ్చుటను గూర్చి ఏల మాట్లాడక పోతివిు?

11రాజైన దావీదు ఇది విని యాజకులగు సాదోకునకును అబ్యాతారునకును వర్తమానము పంపిఇశ్రాయేలువా రందరు మాటలాడుకొను సంగతి నగరిలోనున్న రాజునకు వినబడెను గనుక రాజును నగరికి మరల తోడుకొని రాకుండ మీరెందుకు ఆలస్యము చేయుచున్నారు?

2 సమూయేలు 19 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी