యెషయా 28:8

వారి భోజనపు బల్లలన్నియు వాంతితోను కల్మషముల తోను నిండియున్నవి అవి లేనిచోటు లేదు.

సందర్భంతో చదవండి · యెషయా 28

6ఆయన న్యాయపీఠముమీద కూర్చుండువారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను గుమ్మమునొద్ద యుద్ధమును పారగొట్టువారికి పరాక్రమము పుట్టించువాడుగాను ఉండును.

7అయితే వీరును ద్రాక్షారసమువలన సొక్కి సోలుదురు మద్యమువలన తత్తరపడుదురు యాజకులేమి ప్రవక్తలేమి అందరును మద్యమువలన సొక్కి సోలుదురు ద్రాక్షారసము వారిని మింగివేయుచున్నది మద్యమువలన తత్తరపడుచున్నారు దర్శనము కలుగునప్పుడు సోలుదురు తీర్పుతీర్చుకాలమున తత్తరపడుదురు.

8వారి భోజనపు బల్లలన్నియు వాంతితోను కల్మషముల తోను నిండియున్నవి అవి లేనిచోటు లేదు.

9వాడు ఎవరికి విద్య నేర్పును? ఎవరికి వర్తమానము తెలియ జేయును? తల్లిపాలు విడిచినవారికా? చన్ను విడిచినవారికా?

10ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట nచెప్పుచున్నాడని వారనుకొందురు.

యెషయా 28 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी