1 సమూయేలు 26:17

సౌలు దావీదు స్వరము ఎరిగిదావీదా నాయనా, యిది నీ స్వరమేగదా అని అనగా దావీదు ఇట్లనెనునా యేలినవాడా నా రాజా, నా స్వరమే.

సందర్భంతో చదవండి · 1 సమూయేలు 26

15​​అందుకు దావీదునీవు మగవాడవు కావా? ఇశ్రాయేలీయులలో నీ వంటివాడెవడు? నీకు యజమానుడగు రాజునకు నీ వెందుకు కాపు కాయక పోతివి? నీకు యజమానుడగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువకు వచ్చెనే;

16నీ ప్రవర్తన అను కూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడవే; యెహోవా చేత అభిషేకము నొందిన నీ యేలినవానికి నీవు రక్షకముగా నుండలేదు; యెహోవా జీవముతోడు నీవు మరణశిక్షకు పాత్రుడవు. రాజుయొక్క యీటె యెక్కడ నున్నదో చూడుము, అతని తలగడయొద్దనున్న నీళ్లబుడ్డి యెక్కడ నున్నదో చూడుము అని పలికెను.

17సౌలు దావీదు స్వరము ఎరిగిదావీదా నాయనా, యిది నీ స్వరమేగదా అని అనగా దావీదు ఇట్లనెనునా యేలినవాడా నా రాజా, నా స్వరమే.

18నా యేలిన వాడు తన దాసుని ఈలాగు ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసితిని? నావలన ఏ కీడు నీకు సంభవించును?

19రాజా నా యేలిన వాడా, నీ దాసుని మాటలు వినుము. నామీద పడవలెనని యెహోవా నిన్ను ప్రేరేపించినయెడల నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును. అయితే నరులెవరైనను నిన్ను ప్రేరేపించిన యెడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారునీవు దేశమును విడిచి అన్య దేవతలను పూజించుమని నాతో చెప్పి, యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండ నన్ను వెలివేయు చున్నారు.

1 సమూయేలు 26 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी