జెకర్యా 1:16

కాబట్టి యెహోవా సెలవిచ్చున దేమనగావాత్సల్యముగలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగియున్నాను; అందులో నా మందిరము కట్ట బడును; యెరూషలేముమీద శిల్పకారులు నూలు సాగ లాగుదురు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

సందర్భంతో చదవండి · జెకర్యా 1

14కాబట్టి నాతో మాటలాడు చున్న దూత నాతో ఇట్లనెనునీవు ప్రకటన చేయ వలసినదేమనగాసైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునేను యెరూషలేము విషయములోను సీయోనువిషయములోను అధికాసక్తి కలిగియున్నాను;

15నిమ్మళముగా ఉన్న అన్యజనులమీద నేను బహుగా కోపించుచున్నాను; ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడుచేయవలెనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి.

16కాబట్టి యెహోవా సెలవిచ్చున దేమనగావాత్సల్యముగలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగియున్నాను; అందులో నా మందిరము కట్ట బడును; యెరూషలేముమీద శిల్పకారులు నూలు సాగ లాగుదురు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

17నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును, ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును.

18అప్పుడు నేను తేరిచూడగా నాలుగు కొమ్ములు కన బడెను.

జెకర్యా 1 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी