ద్వితియోపదేశకాండము 15:4

నీవు స్వాధీన పరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్య ముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చ యముగా ఆశీర్వదించును.

సందర్భంతో చదవండి · ద్వితియోపదేశకాండము 15

2తన పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇయ్యవలెను. అది యెహోవాకు గడువు అనబడును గనుక అప్పిచ్చినవాడు తన పొరుగువానినైనను తన సహోదరునినైనను నిర్బంధింప కూడదు.

3అన్యుని నిర్బంధింప వచ్చును గాని నీ సహో దరుని యొద్దనున్న దానిని విడిచిపెట్టవలెను.

4నీవు స్వాధీన పరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్య ముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చ యముగా ఆశీర్వదించును.

5కావున నేడు నేను నీ కాజ్ఞా పించుచున్న యీ ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచు కొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినినయెడల మీలో బీదలు ఉండనే ఉండరు.

6ఏల యనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవుగాని అప్పుచేయవు; అనేక జనములను ఏలు దువు గాని వారు నిన్ను ఏలరు.

ద్వితియోపదేశకాండము 15 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी