తరువాత దావీదు అవతలకుపోయి దూరముగా నున్న కొండమీద నిలిచి, ఉభయుల మధ్యను చాలా యెడముండగా
11యెహోవాచేత అభిషేకము నొందిన వానిని నేను చంపను; ఆలాగున నేను చేయకుండ యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడ దగ్గరనున్న యీటెను నీళ్ల బుడ్డిని తీసికొని మనము వెళ్లిపోదము రమ్మని అబీషైతో చెప్పి
12సౌలు తలగడదగ్గర నున్న యీటెను నీళ్లబుడ్డిని తీసికొని వారిద్దరు వెళ్లిపోయిరి. యెహోవాచేత వారి కందరికి గాఢనిద్ర కలుగగా వారిలో ఎవడును నిద్ర మేలుకొనలేదు, ఎవడును వచ్చిన వారిని చూడలేదు, జరిగినదాని గుర్తు పట్టినవాడొకడును లేడు.
13తరువాత దావీదు అవతలకుపోయి దూరముగా నున్న కొండమీద నిలిచి, ఉభయుల మధ్యను చాలా యెడముండగా
14జనులును నేరు కుమారుడైన అబ్నేరును వినునట్లు అబ్నేరూ, నీవు మాటలాడవా? అని కేక వేయగా అబ్నేరు కేకలువేసిరాజును నిద్రలేపు నీవెవడవని అడిగెను.
15అందుకు దావీదునీవు మగవాడవు కావా? ఇశ్రాయేలీయులలో నీ వంటివాడెవడు? నీకు యజమానుడగు రాజునకు నీ వెందుకు కాపు కాయక పోతివి? నీకు యజమానుడగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువకు వచ్చెనే;
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి