యెహేజ్కేలు 26:18

ఇప్పుడు నీవు కూలినందున ద్వీపములు కంపించుచున్నవి, నీవు వెళ్లిపోవుట చూచి సముద్రద్వీపములు కదలు చున్నవి.

సందర్భంతో చదవండి · యెహేజ్కేలు 26

16​సముద్రపు అధిపతులంద రును తమ సింహాసనములమీదనుండి దిగి, తమ చొక్కాయి లను విచిత్రమైన వస్త్రములను తీసివేసి, దిగులుపడిన వారై నేలను కూర్చుండి గడగడ వణకుచు నిన్ను చూచి విస్మయపడుదురు.

17వారు నిన్నుగూర్చి అంగలార్పు వచన మెత్తి ఈలాగున అందురుసముద్ర నివాసమైనదానా, ఖ్యాతినొందిన పట్ణణమా, నీవెట్లు నాశనమైతివి? సముద్ర ప్రయాణము చేయుటవలన దానికిని దాని నివాసులకును బలము కలిగెను, సముద్రవాసులందరిని భీతిల్లచేసినది ఇదే.

18ఇప్పుడు నీవు కూలినందున ద్వీపములు కంపించుచున్నవి, నీవు వెళ్లిపోవుట చూచి సముద్రద్వీపములు కదలు చున్నవి.

19​ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగానివాసులులేని పట్టణములవలెనే నేను నిన్ను పాడుచేయు నప్పుడు మహా సముద్రము నిన్ను ముంచునట్లుగా నీ మీదికి నేను అగాధజలములను రప్పించెదను, పురాతన కాలమందు పాతాళములోనికి దిగిపోయినవారియొద్ద నీ వుండునట్లు నేను నిన్ను పడవేసి, నీవు జనములేని దాన వగుటకై పురాతనకాలములో పాడైన జనులయొద్ద భూమి క్రిందనున్న స్థలములలో నీకు నివాసము నిర్ణయింతును, పాతాళములోనికి దిగి పోవువారితో కూడ నిన్ను నివసింప జేసెదను.

20మరియు సజీవులు నివసించు భూమిమీద నేను మహాఘనకార్యము కలుగజేతును;

యెహేజ్కేలు 26 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी