యెహోషువ 7:20

ఆకాను యెహోషువతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము.

సందర్భంతో చదవండి · యెహోషువ 7

18అతడును అతని యింటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రములోని జెరహు మునిమనుమడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడునైన ఆకాను పట్టుబడెను.

19అప్పుడు యెహోషువ ఆకానుతో నా కుమారుడా ఇశ్రా యేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి, ఆయన యెదుట ఒప్పుకొని, నీవు చేసినదానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా

20ఆకాను యెహోషువతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము.

21దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును రెండువందల తులముల వెండిని ఏబది తుల ముల యెత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసికొంటిని; అదిగో నా డేరామధ్య అవి భూమిలో దాచబడియున్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను.

22అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరుగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి యుండెను, ఆ వెండి దాని క్రిందనుండెను.

యెహోషువ 7 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी