అయితే ఆయన వారి ఆలోచన లెరిగి, ఊచచెయ్యిగలవానితోనీవు లేచి మధ్యను నిలువుమని చెప్పగా, వాడు లేచి నిలి చెను.
6మరియొక విశ్రాంతిదినమున ఆయన సమాజమందిరము లోనికి వెళ్లి బోధించుచున్నప్పుడు, అక్కడ ఊచ కుడి చెయ్యిగలవాడొకడుండెను.
7శాస్త్రులును పరిసయ్యులును ఆయనమీద నేరము మోపవలెనని, విశ్రాంతిదినమున స్వస్థ పరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి;
8అయితే ఆయన వారి ఆలోచన లెరిగి, ఊచచెయ్యిగలవానితోనీవు లేచి మధ్యను నిలువుమని చెప్పగా, వాడు లేచి నిలి చెను.
9అప్పుడు యేసువిశ్రాంతిదినమున మేలుచేయుట ధర్మమా కీడుచేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా ప్రాణ హత్య ధర్మమా? అని మిమ్ము నడుగుచున్నానని వారితో చెప్పి
10వారినందరిని చుట్టు కలయజూచినీ చెయ్యి చాపుమని వానితో చెప్పెను; వాడాలాగు చేయగానే వాని చెయ్యి బాగుపడెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి