యెహేజ్కేలు 40:47

అతడు ఆ ఆవరణమును కొలువగా నిడివియు వెడల్పును నూరుమూరలై చచ్చౌకముగా ఉండెను. మందిరమునకు ఎదురుగా బలిపీఠముంచబడెను.

సందర్భంతో చదవండి · యెహేజ్కేలు 40

45అప్పుడతడు నాతో ఇట్లనెనుదక్షిణపుతట్టు చూచు గది మందిరమునకు కావలి వారగు యాజకులది.

46ఉత్తరపుతట్టు చూచు గది బలిపీఠ మునకు కావలివారగు యాజకులది. వీరు లేవీయులలో సాదోకు సంతతివారై సేవచేయుటకై యెహోవా సన్నిధికి వచ్చువారు.

47అతడు ఆ ఆవరణమును కొలువగా నిడివియు వెడల్పును నూరుమూరలై చచ్చౌకముగా ఉండెను. మందిరమునకు ఎదురుగా బలిపీఠముంచబడెను.

48అతడు మందిరముయొక్క మంటపములోనికి నన్ను తోడుకొని వచ్చి మంటప స్తంభములను ఒక్కొక్కదాని కొలువగా అది ఇరుప్రక్కల అయిదేసి మూరలుండెను, గుమ్మము ఇరుప్రక్కల మూడేసి మూరల వెడల్పు.

49మంటపమునకు నిడివి యిరువది మూరలు; ఎక్కుటకై యుంచబడిన మెట్లదగ్గర దాని వెడల్పు పదకొండు మూరలు, స్తంభములదగ్గర ఇరు ప్రక్కల ఒక్కొక్కటిగా కంబములుంచబడెను.

యెహేజ్కేలు 40 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी