వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించి అరణ్యము లోనికి తోడుకొని వచ్చి
8అయితే వారు నా మాట విననొల్లక నామీద తిరుగుబాటు చేసి, తమకిష్టమైన హేయకృత్యములు చేయుట మాన లేదు, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మానలేదు గనుక వారు ఐగుప్తీయుల దేశములో ఉండగానే నేను నా రౌద్రము వారిమీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని యనుకొంటిని.
9అయితే ఏ అన్య జనులయెదుట నన్ను నేను బయలు పరచుకొంటినో, యే అన్యజనులమధ్య వారుండిరో ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల యెదుట వారికి నన్ను బయలుపరచుకొంటిని, నా నామమునకు దూషణ కలుగకుండుటకై ఆలాగు చేయుటమాని, ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనతకొరకు నేను వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించి తిని.
10వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించి అరణ్యము లోనికి తోడుకొని వచ్చి
11వారికి నా కట్టడలను నియ మించి నా విధులను వారికి తెలియజేసితిని. ఎవడైన వాటి ననుసరించినయెడల వాటినిబట్టి బ్రదుకును.
12మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలిసికొనునట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినము లను వారికి సూచనగా నేను నియమించితిని.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి