హబక్కూకు 1:9

​వెనుక చూడకుండ బలా త్కారము చేయుటకై వారు వత్తురు, ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టు కొందురు.

సందర్భంతో చదవండి · హబక్కూకు 1

7వారు ఘోరమైన భీకరజనముగా ఉన్నారు, వారు ప్రభుత్వ మును విధులను తమ యిచ్ఛవచ్చినట్లు ఏర్పరచుకొందురు.

8వారి గుఱ్ఱ ములు చిరుతపులులకంటె వేగముగా పరుగులెత్తును, రాత్రి యందు తిరుగులాడు తోడేళ్లకంటెను అవి చురుకైనవి; వారి రౌతులు దూరమునుండి వచ్చి తటాలున జొరబడు దురు, ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చునట్లు వారు పరుగులెత్తి వత్తురు.

9​వెనుక చూడకుండ బలా త్కారము చేయుటకై వారు వత్తురు, ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టు కొందురు.

10రాజు లను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేతురు, ప్రాకారముగల దుర్గములన్నిటిని తృణీకరింతురు, మంటి దిబ్బవేసి వాటిని పట్టుకొందురు.

11తమ బలమునే తమకు దేవతగా భావింతురు, గాలికొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవుచు అపరాధులగుదురు.

హబక్కూకు 1 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी