జెకర్యా 14:16

మరియు యెరూషలేముమీదికి వచ్చిన అన్యజనులలో శేషిం చినవారందరును సైన్య ములకు అధిపతియగు యెహోవా యను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాలపండుగ ఆచరించుటకును ఏటేట వత్తురు.

సందర్భంతో చదవండి · జెకర్యా 14

14యూదావారు యెరూషలేమునొద్ద యుద్ధము చేయుదురు, బంగారును వెండియు వస్త్రములును చుట్టు నున్న అన్యజనులందరి ఆస్తియంతయు విస్తారముగా కూర్చ బడును.

15ఆలాగుననే గుఱ్ఱములమీదను కంచర గాడిదల మీదను ఒంటెలమీదను గార్దభములమీదను దండు పాళె ములో ఉన్న పశువులన్నిటిమీదను తెగుళ్లుపడును.

16మరియు యెరూషలేముమీదికి వచ్చిన అన్యజనులలో శేషిం చినవారందరును సైన్య ములకు అధిపతియగు యెహోవా యను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాలపండుగ ఆచరించుటకును ఏటేట వత్తురు.

17లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవా యను రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరిమీద వర్షము కురువకుండును.

18​ఐగుప్తీయుల కుటుంబపువారు బయలుదేరకయు రాకయు ఉండినయెడల వారికి వర్షము లేకపోవును, పర్ణశాలపండుగ ఆచరించుటకై రాని అన్యజనులకు తాను నియమించిన తెగులుతో యెహోవా వారిని మొత్తును.

జెకర్యా 14 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी