యోవేలు 3:12

నలుదిక్కులనున్న అన్య జనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును; అన్యజనులు లేచి అచ్చటికి రావలెను

సందర్భంతో చదవండి · యోవేలు 3

10​మీ కఱ్ఱులు చెడగొట్టి ఖడ్గ ములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి; బలహీనుడునేను బలాఢ్యుడను అనుకొన వలెను.

11​చుట్టుపట్లనున్న అన్యజనులారా, త్వరపడి రండి; సమకూడి రండి. యెహోవా, నీ పరాక్రమ శాలురను ఇక్కడికి తోడుకొని రమ్ము.

12నలుదిక్కులనున్న అన్య జనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును; అన్యజనులు లేచి అచ్చటికి రావలెను

13​పైరు ముదిరినది, కొడవలిపెట్టి కోయుడి; గానుగ నిండియున్నది; తొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషము అత్యధిక మాయెను, మీరు దిగి రండి.

14తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవాదినము వచ్చే యున్నది; తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి యున్నారు.

యోవేలు 3 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी