యెషయా 57:4

మీరెవని ఎగతాళి చేయుచున్నారు? ఎవని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులును కారా?

సందర్భంతో చదవండి · యెషయా 57

2వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు తమకు సూటిగానున్న మార్గమున నడచువారు తమ పడకలమీద పరుండి విశ్రమించుచున్నారు.

3మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్యాసంతానమా, మీరక్కడికి రండి.

4మీరెవని ఎగతాళి చేయుచున్నారు? ఎవని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులును కారా?

5మస్తచావృక్షములను చూచి పచ్చని ప్రతిచెట్టు క్రిందను కామము రేపుకొనువారలారా, లోయలలో రాతిసందులక్రింద పిల్లలను చంపువార లారా,

6నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే యున్నది అవియే నీకు భాగ్యము, వాటికే పానీయార్పణము చేయుచున్నావు వాటికే నైవేద్యము నర్పించుచున్నావు.ఇవన్నియు జరుగగా నేను ఊరకుండదగునా?

యెషయా 57 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी