యెహేజ్కేలు 9:1

మరియు నేను చెవులార వినునట్లు ఆయనగట్టిగా ఈ మాటలు ప్రకటించెనుఒక్కొకడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకొనిపట్టణపు కావలి వారందరును ఇక్కడికి రండి అనెను.

సందర్భంతో చదవండి · యెహేజ్కేలు 9

1మరియు నేను చెవులార వినునట్లు ఆయనగట్టిగా ఈ మాటలు ప్రకటించెనుఒక్కొకడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకొనిపట్టణపు కావలి వారందరును ఇక్కడికి రండి అనెను.

2అంతలో ఒక్కొ కడు తాను హతముచేయు ఆయుధమును చేత పట్టుకొని, ఉత్తర దిక్కుననున్న పై గవిని మార్గముగా ఆరుగురు మనుష్యులు వచ్చుచుండిరి. వారి మధ్య ఒకడు, అవిసె నారబట్ట ధరించుకొని నడుమునకు లేఖకుని సిరాబుడ్డి కట్టుకొని యుండెను; వారు ఆలయమున ప్రవేశించి యిత్తడి బలిపీఠమునొద్ద నిలిచిరి.

3ఇశ్రాయేలీయుల దేవుని మహిమ తానున్న కెరూబుపైనుండి దిగి మందిరపు గడప దగ్గరకువచ్చి నిలిచి, అవిసె నారబట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వానిని పిలువగా

యెహేజ్కేలు 9 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी