తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా?
2ఇతరులకు నేను అపొస్తలుడను కాకపోయినను మీమట్టుకైనను అపొస్తలుడనై యున్నాను. ప్రభువునందు నా అపొస్తలత్వ మునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా?
3నన్ను విమర్శించువారికి నేను చెప్పుసమాధానమిదే.
4తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా?
5తక్కిన అపొస్తలులవలెను, ప్రభువుయొక్క సహోదరులవలెను, కేఫావలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారములేదా?
6మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేని వారమా?
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి