వాటియొక్క లెక్క ముప్పది బంగారపు పళ్లెములును వెయ్యి వెండి పళ్లెములును ఇరువది తొమి్మది కత్తులును
7మరియు నెబు కద్నెజరు యెరూషలేములోనుండి తీసికొని వచ్చి తన దేవ తలయొక్క గుడియందుంచిన యెహోవా మందిరపు ఉప కరణములను రాజైన కోరెషు బయటికి తెప్పించెను.
8పారసీకదేశపు రాజైన కోరెషు తన ఖజానాదారుడైన మిత్రిదాతుద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి, యూదులకు అధిపతియగు షేష్బజ్జరు చేతికి అప్పగించెను.
9వాటియొక్క లెక్క ముప్పది బంగారపు పళ్లెములును వెయ్యి వెండి పళ్లెములును ఇరువది తొమి్మది కత్తులును
10ముప్పది బంగారుగిన్నెలును నాలుగువందలపది వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలును, మరి యితరమైన ఉపకరణములును వెయ్యియై యుండెను.
11బంగారు వస్తువులును వెండి వస్తువులును అన్నియు అయిదువేల నాలుగు వందలు. షేష్బజ్జరు బబులోనుచరలోనుండి విడిపింపబడినవారితో కూడ కలిసి వీటన్నిటిని యెరూషలేమునకు తీసికొని వచ్చెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి