ద్వితియోపదేశకాండము 7:17

ఈ జనములు నాకంటె విస్తారముగా ఉన్నారు, నేను ఎట్లు వారిని వెళ్లగొట్టగల నని నీవనుకొందువేమో, వారికి భయపడకుము.

సందర్భంతో చదవండి · ద్వితియోపదేశకాండము 7

15యెహోవా నీయొద్దనుండి సర్వరోగములను తొలగించి, నీవెరిగియున్న ఐగుప్తు లోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటిని నీకు దూరపరచి, నిన్ను ద్వేషించు వారందరిమీదికే వాటిని పంపించును.

16మరియు నీ దేవు డైన యెహోవా నీ కప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనముచేయుదువు. నీవు వారిని కటా క్షింపకూడదు, వారి దేవతలను పూజింపకూడదు, ఏల యనగా అది నీకు ఉరియగును.

17ఈ జనములు నాకంటె విస్తారముగా ఉన్నారు, నేను ఎట్లు వారిని వెళ్లగొట్టగల నని నీవనుకొందువేమో, వారికి భయపడకుము.

18​నీ దేవు డైన యెహోవా ఫరోకును ఐగుప్తుదేశమంతటికిని చేసిన దానిని, అనగా నీ దేవుడైన యెహోవా నిన్ను రప్పించి నప్పుడు

19​నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్కార్యములను బాహుబలమును, చాచిన చేతిని బాగుగ జ్ఞాపకము చేసికొనుము. నీకు భయము పుట్టించుచున్న ఆ జనులకందరికి నీ దేవుడైన యెహోవా ఆలాగే చేయును.

ద్వితియోపదేశకాండము 7 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी