జెకర్యా 7:8

మరియు యెహోవా వాక్కు జెకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా

సందర్భంతో చదవండి · జెకర్యా 7

6మరియు మీరు ఆహారము పుచ్చుకొనినప్పుడు స్వప్రయో జనమునకే గదా పుచ్చుకొంటిరి; మీరు పానము చేసి నప్పుడు స్వప్రయోజనమునకే గదా పానము చేసితిరి.

7యెరూషలేములోను దాని చుట్టును పట్టణములలోను దక్షిణదేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్నకాలమున పూర్వికులగు ప్రవక్తలద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సునకు తెచ్చుకొనకుండవచ్చునా?

8మరియు యెహోవా వాక్కు జెకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా

9సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చియున్నాడు సత్యము ననుసరించి తీర్పు తీర్చుడి, ఒకరియందొకరు కరుణా వాత్సల్యములు కనుపరచుకొనుడి.

10విధవరాండ్రను తండ్రిలేనివారిని పరదేశులను దరిద్రులను బాధపెట్టకుడి, మీ హృదయ మందు సహోదరులలో ఎవరికిని కీడు చేయ దలచకుడి.

జెకర్యా 7 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी