1 సమూయేలు 12:5

​అతడు అట్టిది నాయొద్ద ఏదియు మీకు దొరకదని యెహోవాయును ఆయన అభిషేకము చేయించినవాడును ఈ దినమున మీ మీద సాక్షులై యున్నారు అని చెప్పినప్పుడుసాక్షులే అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి.

సందర్భంతో చదవండి · 1 సమూయేలు 12

3​ఇదిగో నేనున్నాను, నేనెవని యెద్దునైన తీసికొంటినా? ఎవని గార్దభమునైన పట్టు కొంటినా? ఎవనికైన అన్యాయము చేసితినా? ఎవనినైన బాధపెట్టితినా? న్యాయము నాకు అగపడకుండ ఎవని యొద్దనైన లంచము పుచ్చుకొంటినా? ఆలాగు చేసినయెడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని యెదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను, అప్పుడు నేను మీ యెదుట దానిని మరల నిత్తు ననెను.

4​నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు; ఏ మనుష్యునియొద్దగాని నీవు దేనినైనను తీసికొనలేదని వారు చెప్పగా

5​అతడు అట్టిది నాయొద్ద ఏదియు మీకు దొరకదని యెహోవాయును ఆయన అభిషేకము చేయించినవాడును ఈ దినమున మీ మీద సాక్షులై యున్నారు అని చెప్పినప్పుడుసాక్షులే అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి.

6​మరియు సమూయేలు జనులతో ఇట్లనెనుమోషేను అహరోనును నిర్ణయించి మీ పితరులను ఐగుప్తుదేశములోనుండి రప్పించినవాడు యెహోవాయే గదా

7​కాబట్టి యెహోవా మీకును మీ పితరులకును చేసిన నీతికార్యములనుబట్టి యెహోవా సన్ని ధిని నేను మీతో వాదించునట్లు మీరు ఇక్కడ నిలిచి యుండుడి

1 సమూయేలు 12 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी