ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీమీదికి రాకుండ చూచుకొనుడి; అదేమనగా
38కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు,
39మీరు మోషే ధర్మశాస్త్రమువలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేక పోతిరో ఆ విషయము లన్నిటిలో, విశ్వసించు ప్రతివాడును ఈయనవలననే నీతి మంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియు గాక.
40ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీమీదికి రాకుండ చూచుకొనుడి; అదేమనగా
41ఇదిగో తిరస్కరించువారలారా, ఆశ్చర్యపడుడి నశించుడి మీ దినములలో నేనొక కార్యము చేసెదను ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనెను.
42వారు సమాజమందిరములోనుండి వెళ్లుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతిదినమున తమతో చెప్పవలెనని జనులు వేడుకొనిరి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి