2 రాజులు 4:31

​​గేహజీ వారికంటె ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖముమీద పెట్టెను గాని యే శబ్దమును రాకపోయెను, ఏమియు వినవచ్చినట్టు కన బడలేదు గనుక వాడు ఏలీషాను ఎదుర్కొనవచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పెను.

సందర్భంతో చదవండి · 2 రాజులు 4

29​అతడునీ నడుము బిగించు కొని నా దండమును చేతపట్టుకొని పొమ్ము; ఎవరైనను నీకు ఎదురుపడిన యెడల వారికి నమస్కరింపవద్దు; ఎవరైనను నీకు నమస్కరించినయెడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు; అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖముమీద పెట్టుమని గేహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను.

30​తల్లి ఆ మాట వినియెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడ పోయెను.

31​​గేహజీ వారికంటె ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖముమీద పెట్టెను గాని యే శబ్దమును రాకపోయెను, ఏమియు వినవచ్చినట్టు కన బడలేదు గనుక వాడు ఏలీషాను ఎదుర్కొనవచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పెను.

32​​ఎలీషా ఆ యింట జొచ్చి, బాలుడు మరణమైయుండి తన మంచముమీద పెట్టబడి యుండుట చూచి

33​​తానే లోపలికిపోయి వారిద్దరే లోపలనుండగా తలుపువేసి, యెహోవాకు ప్రార్థనచేసి

2 రాజులు 4 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी